ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?: నాగం

ప్రధానాంశాలు

ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?: నాగం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, కేసీఆర్‌ తెచ్చిన ప్రాజెక్టులపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని మాజీమంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి తెరాస నేతలకు సవాల్‌ విసిరారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ సభ విజయవంతం కావడంతో జిల్లా తెరాస నేతలకు భయం పట్టుకుని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై అర్థంలేని విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కృష్ణానీటిని శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి అక్రమంగా తరలించుకుపోయేందుకు ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వర ప్రాజెక్టుకు రూపకల్పన ప్రగతిభవన్‌లోనే జరిగిందని తెరాస నేతలకు తెలుసా? అని ప్రశ్నించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన తెచ్చుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డికి సూచించారు.

విద్యార్థి, నిరుద్యోగ అంశాలపై జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకు రేవంత్‌రెడ్డిపైన తెరాస నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని