ఈసీకి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్‌

ప్రధానాంశాలు

ఈసీకి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెరాస ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో ఎన్నికల కమిషన్‌ను హెచ్చరించినట్లుగా మాట్లాడటంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని లేదా ఎన్నికల కమిషన్‌ ఆయనపై చర్యలు తీసుకోవాలంది. ఈ మేరకు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌(ఈసీఐ) సుశీల్‌ చంద్రజీకి లేఖ రాశారు.

తెరాస ఫ్లెక్సీలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ

హైదరాబాద్‌లో వెలిసిన తెరాస ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్‌లపై పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌కు లేఖ రాశారు. వాటి ఏర్పాటుకు అనుమతి ఉందా? ఉంటే వసూలు చేసిన ఫీజు ఎంత? తదితర వివరాలు తెలియచేయాలని కోరారు.

పోడు సమస్యను సత్వరం పరిష్కరించాలి

పోడు భూముల సమస్యను సత్వరం పరిష్కరించాలని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ సోమవారం డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివాసీల హక్కుల్ని కాలరాస్తున్నారని ఆరోపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని