ఉద్యమ శక్తులను ఏకం చేస్తాం: కోదండరాం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యమ శక్తులను ఏకం చేస్తాం: కోదండరాం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉద్యమ శక్తులను ఏకం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన బుద్ధి చెబుతామని తెజస రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. తెరాసలోని సగానికిపైగా ఎమ్మెల్యేలు, మంత్రులు భూదందా వ్యవహారాల్లో కూరుకుపోయారని ఆరోపించారు. అందరి చిట్టాలను త్వరలో బయటపెడతామన్నారు. కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం కేసులను తగ్గించి చూపిస్తుండటంతో కేంద్రం నుంచి సరిపడా టీకాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు రావడంలేదని ఆక్షేపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు