కుటుంబానికి ఆ పరిస్థితి కలిగించను: వార్నర్‌
close

తాజా వార్తలు

Published : 23/11/2020 21:07 IST

కుటుంబానికి ఆ పరిస్థితి కలిగించను: వార్నర్‌

ఇంటర్నెట్‌డెస్క్: బయోబబుల్‌లో ఉంటూ క్రికెట్‌ ఆడటం వల్ల కుటుంబానికి ఎంతో దూరమవుతున్నానని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ అన్నాడు. గత ఆరు నెలలు ఎంతో కఠినంగా గడిచాయని, అయితే ప్రస్తుతం రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లపై దృష్టిసారిస్తున్నాని తెలిపాడు. ‘‘బయోబబుల్‌లో ఉండటం ఎంతో కష్టం. కుటుంబానికి దూరంగా ఉంటూ బుడగలో ఉన్న ఆరు నెలలు ఎంతో కఠినంగా గడిచాయి. ప్రతివ్యక్తికి భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. వచ్చే 12 నెలలను చూస్తే మరింత క్లిష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటికి ఎప్పుడొస్తామో, కుటుంబంతో ఎంతసేపు కలిసి ఉంటామో తెలియదు. కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతున్నాం. కాగా, 14 రోజులు క్వారంటైన్‌ నిబంధనలు పాటిస్తూ హోటల్‌లో ఉండి, ముగ్గురు పిల్లలు, భార్యను కలవడం ఎంతో సవాలుగా ఉంటుంది. ఇంట్లోనే 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితిని మా కుటుంబానికి కలిగించను’’ అని వార్నర్‌ అన్నాడు.

వచ్చే ఏడాది భారత్‌లో, 2021లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లకు సన్నద్ధమవుతున్నట్లు వార్నర్‌ తెలిపాడు. దానికి తగ్గట్లుగా ఆటగాళ్లు, కోచ్‌ సిబ్బందిని గుర్తించామని అన్నాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌పై ప్రత్యేక సాధన చేస్తున్నామని పేర్కొన్నాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే వరకు బిగ్‌బాష్ లీగ్‌ ఆడని వార్నర్‌ చెప్పాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు కాస్త విరామం ఉండాలని, అందుకే దూరమవ్వాలనుకున్నానని అన్నాడు. అంతేగాక తన ముగ్గురు పిల్లలకు, భార్యకు సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాని తెలిపాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో రెండు సీజన్లలో ఆడిన వార్నర్‌ 2013-14 సీజన్‌లో చివరిగా ఆడాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని