ఆదుకున్న తివారి.. చెన్నై లక్ష్యం 163
close

తాజా వార్తలు

Published : 19/09/2020 21:40 IST

ఆదుకున్న తివారి.. చెన్నై లక్ష్యం 163

బౌలింగ్‌తో ఆకట్టుకున్న ధోనీ సేన

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సౌరభ్‌ తివారి(42; 31 బంతుల్లో 3x4, 1x6), క్వింటన్‌ డికాక్‌(33; 20 బంతుల్లో 5x4) రాణించడంతో చెన్నై ముందు పోరాడే స్కోర్‌ నిర్దేశించింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ (12), డికాక్‌ శుభారంభం చేసినా వారిద్దరూ వెనువెంటనే ఔటయ్యారు. అనంతరం సూర్యకుమార్‌ (17)తో జోడీ కట్టిన తివారి బాధ్యతాయుతంగా ఆడాడు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు మంచి స్కోర్‌ అందించారు. అనంతరం ముంబయి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న హార్దిక్‌ పాండ్య (14), కీరన్‌ పొలార్డ్‌ (18) సైతం నిరాశపరిచారు. దీంతో ముంబయి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా.. జడేజా, దీపక్‌ చాహర్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక సామ్‌కరన్‌, పీయుష్‌ చావ్లా చెరో వికెట్‌ తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని