Viral Video: ఊహించని గిఫ్ట్‌.. చిన్నారి కన్నీటి పర్యంతం 

తాజా వార్తలు

Published : 09/07/2021 18:11 IST

Viral Video: ఊహించని గిఫ్ట్‌.. చిన్నారి కన్నీటి పర్యంతం 

మనసులు గెలిచిన ఇంగ్లాండ్‌ ఆటగాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు మాసన్‌ మౌంట్‌ నెటిజెన్ల మనసు కొల్లగొట్టాడు. తాజాగా జరిగిన యూరోకప్‌ 2020 సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌.. డెన్మార్క్‌పై 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ జట్టు 55 ఏళ్ల తర్వాత ఓ పెద్ద టోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే ఇంగ్లిష్‌ జట్టు ఆటగాడు మాసన్‌ ఓ చిన్నారి అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చాడు. దాంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.

డెన్మార్క్‌తో విజయం సాధించాక ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, అదే సమయంలో ఆ మ్యాచ్‌ చూడటానికి వచ్చిన ఓ చిన్నారిని చూసిన మాసన్‌ స్టాండ్స్‌లో నిల్చున్న ఆమె వద్దకు వెళ్లి తన జెర్సీని గుర్తుగా ఇచ్చాడు. తాను ఎంతగానో ఇష్టపడే ఫుట్‌బాల్‌ టీమ్‌ ఆటగాడు స్వయంగా జెర్సీని బహుమతిగా ఇవ్వడంతో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనైంది. సంతోషం పట్టలేక తన తండ్రిని హత్తుకొని ఆనందబాష్పాలు కార్చింది. దాంతో అక్కడున్న వారంతా ఆ చిన్నారికి, ఆమె తండ్రికి అభినందనలు తెలిపారు. ఆ వీడియోను ఒక వ్యక్తి తొలుత సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా ఇంగ్లాండ్‌ టీమ్‌ దాన్ని తమ ట్విటర్‌లో పోస్టు చేసింది. కాగా, ఆ వీడియో పోస్టు చేసిన 24 గంటల్లోనే 71 లక్షల మందికిపైగా వీక్షించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని