ఇంటర్వ్యూ పేరుతో ఇంటికి తీసుకెళ్లాడు: అంజలి 
close

తాజా వార్తలు

Published : 25/05/2021 23:09 IST

ఇంటర్వ్యూ పేరుతో ఇంటికి తీసుకెళ్లాడు: అంజలి 

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌, డాక్టర్‌ అంజలి తెందూల్కర్‌ దంపతుల వివాహ బంధానికి సోమవారంతో 26 వసంతాలు పూర్తయ్యాయి. 1995 మే 24న ఈ జంట ఒక్కటైంది. అయితే, సచిన్‌తో ఏర్పడిన మొదటి పరిచయం, ఏ అబద్ధం చెప్పి సచిన్‌..  తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడనే విషయాలను 26వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అంజలి గుర్తుచేసుకున్నారు. 

‘నన్ను సచిన్‌ను మొదటిసారి చూసినప్పుడు అతడికి 17 సంవత్సరాలు. ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకుని విమానాశ్రయం చేరుకున్నాడు. అదే సమయంలో మా అమ్మను రిసీవ్‌ చేసుకోవడానికి అక్కడికి చేరుకున్నా. ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకున్నాం. నన్ను చూసిన మరుక్షణమే పెళ్లి చేసుకోవాలని సచిన్‌ అనుకున్నాడు. కానీ, సచిన్‌ ఎవరు? ఏం చేస్తాడనే విషయాలు నాకప్పటికి తెలీదు. కొంతకాలం తర్వాత మేం ఒక స్నేహితుడి ద్వారా కలుసుకున్నాం’ అని అంజలి పేర్కొన్నారు. 

తన తల్లిదండ్రులకు అంజలి గురించి చెప్పడానికి సచిన్‌ ఎటువంటి ప్రణాళిక వేశాడనే విషయాన్ని 2015లో సచిన్‌ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్‌ మై వే’ ఆవిష్కరణ సమయంలో అంజలి వివరించారు. ‘జర్నలిస్టుగా నటించాలని, అలా నన్ను వారి కుటుంబసభ్యులకు పరిచయం చేస్తానని చెప్పాడు. తనను ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్న జర్నలిస్టుగా నన్ను సచిన్‌ను తన ఇంటికి ఆహ్వానించాడు. ఈ సమయంలో సచిన్‌ కాస్త భయపడ్డాడు. సల్వార్‌ కమీజ్‌ ధరించి మొదటిసారి ఆయన ఇంటికి వెళ్లా’ అని అంజలి చెప్పారు.

‘మా పరిచయం బలపడిన తర్వాత అతనితో మాట్లాడటానికి ఇప్పటి మాదిరిగా ఆ కాలంలో మొబైల్‌ ఫోన్లు లేవు. అందువల్ల అతనితో మాట్లాడటానికి 48 ఎకరాల కళాశాల ప్రాంగణాన్ని దాటి టెలిఫోన్ బూత్‌కు వెళ్లేదాన్ని. ఎక్కువ సమయం మాట్లాడటంతో బిల్లు కూడా ఎక్కువగా వచ్చేది. టెలిఫోన్ బిల్లులను ఆదా చేయడానికి సచిన్‌ సిడ్నీ వెళ్లినప్పట్నుంచి లేఖలు రాయాలని నిర్ణయించుకున్నా’ అని అంజలి చెప్పుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని