దాదా గెలవడం నేర్పిస్తే ధోనీ అలవాటు చేశాడు

తాజా వార్తలు

Updated : 07/07/2021 13:56 IST

దాదా గెలవడం నేర్పిస్తే ధోనీ అలవాటు చేశాడు

మహీకి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ నేడు 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా క్రికెటర్లు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉదయం నుంచే సోషల్‌ మీడియాలో హంగామా చేస్తున్నారు. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి వ్యాపారవేత్తల వరకు.. ఇతర క్రీడా ప్రముఖుల నుంచి సాధారణ అభిమానుల వరకు మహీకి ట్విటర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

* సహచరుడు, నాయకుడు, మిత్రుడు! హ్యాపీ బర్త్‌డే, మహీ. ఈ ఏడాదంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి - సచిన్‌ తెందూల్కర్‌

* మహేంద్ర.. అంటే ఆకాశానికి దేవుడని అర్థం. రంగంలోకి దిగి భారీ సిక్సర్లతో ఆకాశ లోకాన్నీ.. భూమ్మీదున్న ప్రజల ప్రేమను గెలిచి భూలోకాన్నీ సంతోషపెట్టాడు. తరానికి ఒక ఆటగాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎంఎస్‌ ధోనీ - వీరేంద్ర సెహ్వాగ్‌

* ఎంఎస్‌ ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు. అతడు మరింత ప్రేమను పొందాలి. రాబోయే తరాలకు ప్రేరణ కల్పించాలి - వీవీఎస్‌ లక్ష్మణ్‌

* ఎంఎస్‌ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నాకు మిత్రుడు, సోదరుడు, మార్గనిర్దేశకుడు. మీ నుంచి అందరూ కోరుకునేది ఇదే. మీ ఆరోగ్యం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఒక గొప్ప ఆటగాడిగా, నాయకుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు - సురేశ్‌ రైనా

* మాలాంటి యువకులకు దాదా ఎలా గెలవాలో బోధించారు. ధోనీ దానిని ఒక అలవాటుగా మార్చేశాడు. వేర్వేరు తరాలకు చెందిన గొప్ప నాయకులు ఒక రోజు అంతరంతో పుట్టారు. భారత క్రికెట్‌ రూపురేఖలను మార్చేసిన ఇద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు - మహ్మద్‌ కైఫ్‌

* నేనెప్పటికీ ప్రేమించే నా గొప్ప మిత్రుడు మహీ భాయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిన్ను కేవలం ప్రేమించగలం అంతే - హార్దిక్‌ పాండ్య

* టీమ్‌ఇండియా మాజీ సారథి, పద్మభూషణ్‌ ఎంఎస్‌ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం ఆరోగ్యంతో జీవించాలి - నితిన్‌ గడ్కరీ,  కేంద్ర మంత్రి

* హ్యాపీ బర్త్‌డే ఎంఎస్‌ ధోనీ భాయ్‌. మీరే నాకు ఆదర్శం. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి స్ఫూర్తి - కుల్‌దీప్‌ యాదవ్‌

* మహీ భాయ్‌ మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఒక మంచి మిత్రుడు గొప్ప సారథి! ఈ ఏడాదంతా మీకు బాగుండాలి - ఇషాంత్‌ శర్మAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని