Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176105
            [news_title_telugu_html] => 

ఎవరు?

[news_title_telugu] => ఎవరు? [news_title_english] => [news_short_description] => భారత జట్టు దాదాపు ఎనిమిది నెలల తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడబోతోంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ గురువారమే ఆరంభం కాబోతోంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
ఎవరు? - EENADU
close
ఎవరు?

తుది జట్టులో రోహితా.. రహానేనా?
కూర్పుపై డైలమా
విండీస్‌తో రేపట్నుంచే తొలి టెస్టు
అంటిగ్వా

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఫేవరెట్‌గా సిద్ధమవుతున్న టీమ్‌ ఇండియాకు కూర్పు విషయంలో చిక్కొచ్చిపడింది. ఐదో బౌలర్‌ను ఎంచుకుంటే రోహిత్‌ శర్మ, అజింక్య రహానేల్లో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలన్నది కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి పరీక్షగా మారింది. భారత్‌ నలుగురు బౌలర్లతోనే దిగితే తప్ప రోహిత్‌, రహానేల్లో ఒకరు పెవిలియన్‌కు పరిమితం కాక తప్పదు. ఇటీవల ఫామ్‌ ప్రకారం చూస్తే ఆ ఒక్కడు రహానేనే కావొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి, రవిశాస్త్రి.. అదనంగా ఆరో బ్యాట్స్‌మన్‌ వైపు మొగ్గుచూపుతారా లేదా అదనపు బౌలర్‌ (ఐదో బౌలర్‌)ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరం.

భారత జట్టు దాదాపు ఎనిమిది నెలల తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడబోతోంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ గురువారమే ఆరంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముందు ఓపెనింగ్‌ సంగతి తేలాల్సి ఉంది. సాధారణంగా అయితే మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాలి. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో చివరి రెండు టెస్టులకు రాహుల్‌ను తప్పించి అతడి స్థానంలో విహారిని పంపిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అక్కడ విహారి ఎక్కువ పరుగులేమీ చేయకపోయినా.. కొత్త బంతిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. దాని పదును తగ్గించాడు. మయాంక్‌, పుజారా బాగా బ్యాటింగ్‌ చేసేందుకు అది ఉపయోగపడింది. వెస్టిండీస్‌-ఎతో సన్నాహక మ్యాచ్‌లో విహారి అర్ధశతకం చేశాడు. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో అతడు మరోసారి ఓపెనింగ్‌ చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. మూడు, నాలుగులో పుజారా, కోహ్లి రూపంలో భారత్‌కు బలమైన బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. ఆ తర్వాతే సమస్య. రిషబ్‌ పంత్‌ ఆరో స్థానంలో వచ్చే అవకాశాలు మెండు. హార్దిక్‌ పాండ్య గాయంతో దూరమైన నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్‌తో జట్టుకు సమతూకాన్నిస్తాడు. ఐదో స్థానంలో ఎవరిని ఆడించాలన్నదే ప్రశ్న. రహానె, రోహిత్‌లలో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. రోహిత్‌ తానాడిన చివరి టెస్టులో అర్ధశతకం చేశాడు. విండీస్‌-ఎతో సన్నాహక మ్యాచ్‌లోనూ అర్ధశతకం సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం చేసినప్పటికీ కొంతకాలంగా రహానె పెద్దగా ఫామ్‌లో లేడు. కౌంటీ క్రికెట్లో హాంప్‌షైర్‌ తరఫునా అతడు మరీ గొప్పగా ఏమీ రాణించలేకపోయాడు. నలుగురు బౌలర్లలతో దిగడం ఒక్కటే వీళ్లిద్దరినీ ఆడించడానికి మార్గం. అప్పుడు పేసర్లు బుమ్రా, షమి, ఇషాంత్‌ శర్మలతో పాటు ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌ లేదా కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులో ఉండొచ్చు. జడేజా సమీకరణంలో ఉండడు. అయితే టెస్టు క్రికెట్లో 20 వికెట్లు పడగొట్టాలంటే ఐదుగురు బౌలర్లు ఉండాలన్నది కోహ్లి బలమైన విశ్వాసం. ఒకవేళ పిచ్‌ సజీవంగా ఉంటే అతడు నాలుగో పేసర్‌గా ఉమేశ్‌ యాదవ్‌ (ఒక స్పిన్నర్‌తోపాటు)ను ఆడించడానికి సందేహించకపోవచ్చు. మొత్తం మీద తొలి టెస్టు వేదిక వివియన్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో పిచ్‌ ఎలా ఉంటుందన్నదానిపైనే కూర్పు ఆధారపడి ఉంటుంది. నలుగురు భారత బౌలర్లు కూడా 20 వికెట్లు పడగొట్టరన్న అభిప్రాయం ఉంది. కానీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తమ  తొలి మ్యాచ్‌లో కోహ్లి ఆ సాహసం చేస్తాడా?

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.