Shikhar Dhavan : ధావన్‌ కెరీర్‌ అప్పుడే ముగిపిపోలేదు: సబా కరీమ్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 17/09/2021 01:46 IST

Shikhar Dhavan : ధావన్‌ కెరీర్‌ అప్పుడే ముగిపిపోలేదు: సబా కరీమ్‌

ఇంటర్నెట్‌ డెస్కు: టీమిండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ శిఖర్ ధావన్‌ కెరీర్‌ అప్పుడే ముగిసిపోలేదని మాజీ క్రికెటర్‌ సబా కరీమ్‌ అన్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కనంత మాత్రాన అతడిని తక్కువగా అంచనా వేయలేమని పేర్కొన్నాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధావన్‌ చాలా కీలక ఆటగాడు. టీ20 మెగా టోర్నీకి అతడు ఎంపిక కానంత మాత్రాన కెరీర్‌ ముగిసిపోయినట్లు కాదు. టీమిండియాలో ఓపెనర్లు చాలా మంది ఉన్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, యువ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌లు పొట్టి క్రికెట్లో ఓపెనింగ్‌కి సిద్ధంగా ఉన్నారు. అందుకే, ధావన్‌కు జట్టులో చోటు దక్కలేదు. రాబోయే కాలంలో అతడు మళ్లీ భారత జట్టుకు ఆడతాడు. అతడికెంతో భవిష్యత్తు ఉంది’ అని సబా కరీమ్‌ అన్నాడు.

ఇటీవల ప్రకటించిన టీ20 ప్రపంచకప్‌ జట్టులో పలువురు కీలక ఆటగాళ్లు చోటు దక్కించుకోలేకపోయారు. టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, యువ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌లను పక్కన పెట్టిన విషయం తెలిసిందే.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన