close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించండి...

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను మంగళవారం ఆదేశించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, అక్కడ సత్వరం అన్‌లోడింగ్‌ చేసుకుని మిల్లర్లు ఆన్‌లైన్‌ రికార్డుల్లో నమోదు చేయించాలని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు వేచి ఉండే పరిస్థితి కల్పించరాదని హెచ్చరించారు. హమాలీలు, లారీల కొరత లేకుండా చూడాలని, అమ్మిన ధాన్యానికి రైతులకు మూడు రోజుల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు