మండువేసవిలో వర్షాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మండువేసవిలో వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: నిండువేసవిలో వర్షాలు కురుస్తున్నాయి. గత 10 రోజులుగా నిత్యం రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్యలో 285 ప్రాంతాల్లో వాన కురిసింది. అత్యధికంగా రెడ్లవాడ (వరంగల్‌ గ్రామీణ జిల్లా), బెజ్జూరు (కుమురం భీం జిల్లా)లో 5.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విదర్భ ప్రాంతంలో గాలులతో ఉపరితల ఆవర్తనం 1500 మీటర్ల ఎత్తు వరకూ ఉంది. అక్కడి నుంచి కర్ణాటక మీదుగా కేరళ సముద్ర తీరం వరకూ 900 మీటర్ల ఎత్తున ఉత్తర, దక్షిణ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తు వరకూ ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. వర్షాలు లేని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అధికంగా వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరిపైరు నేలవాలి ధాన్యం రాలిపోయింది. కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలాయి. పంటనష్టాలపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులకు సూచించినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు