పలమనేరులో ఏనుగుల హల్‌చల్‌
close

ప్రధానాంశాలు

పలమనేరులో ఏనుగుల హల్‌చల్‌

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోకి వచ్చిన ఏనుగులు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. అడ్డొచ్చిన ఓ ఆవును చంపేశాయి. బుధవారం ఉదయం 6 గంటలకు 26 ఏనుగులు గుంపుగా పలమనేరు నడిబొడ్డున కనిపించడంతో ప్రజలు హడలిపోయారు. అటవీశాఖ అధికారులు వచ్చి వాటిని అడవిలోకి పంపేందుకు బాణసంచా పేల్చారు. ఏనుగుల గుంపు అడ్డొచ్చిన వస్తువులను పడగొడుతూ.. బొమ్మదొడ్డి, బోడిరెడ్డిపల్లె గ్రామాల మీదుగా కదిలాయి. బోడిరెడ్డిపల్లె రైతుకు చెందిన ఓ పాడి ఆవును తొండంతో కొట్టడంతో అది అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో ఆ సమీపంలోని రైతులు కట్టేసిన పశువులన్నింటినీ వదిలేసి, పొలాల్లోకి తరిమేశారు. ఏనుగులను ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు అడవిలోకి మళ్లించగలిగారు.

-న్యూస్‌టుడే, పలమనేరు


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని