నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రిలో 120 ఐసీయూ పడకలు

ప్రధానాంశాలు

నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రిలో 120 ఐసీయూ పడకలు

రూ.2.50 కోట్లతో ఏర్పాటు యూవీకెన్‌ ఫౌండేషన్‌ దాతృత్వం

ఈనాడు, నిజామాబాద్‌: భారత మాజీ స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు చెందిన యూవీకెన్‌ ఫౌండేషన్‌ నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో రూ.2.5 కోట్లతో సౌకర్యాలు సమకూర్చింది. గుర్‌గావ్‌ కేంద్రంగా 2012లో క్యాన్సర్‌ రోగుల సహాయం కోసం ఏర్పాటైన ఈ సంస్థ వివిధ ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పిస్తోంది. కరోనా ఉద్ధృతితో ఆసుపత్రుల్లో పడకలు సరిపోని పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వెయ్యి ఐసీయూ పడకలు ఏర్పాటు చేయాలని ఫౌండేషన్‌ నిర్ణయించింది. అందులోభాగంగా నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రిలో 120 ఐసీయూ పడకలు సమకూర్చారు. ఆధునాతన పడకలు, మానిటర్లు, వెంటిలేటర్లు సహా ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ విషయంలో నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం సిరన్‌పల్లికి చెందిన యువరాజ్‌ సింగ్‌ అభిమాని సృజన్‌ చొరవ తీసుకున్నారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కలిసి సాయానికి సంబంధించిన పత్రం అందించారు. ఈ నేపథ్యంలో ఫౌండేషన్‌ సేవలు ప్రశంసిస్తూ.. మంత్రి ట్వీట్‌ చేశారు. అందుకు కృతజ్ఞతలు చెబుతూ యువరాజ్‌సింగ్‌ బదులిచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని