కేజీబీవీ సిబ్బందికి 180 ప్రసూతి సెలవులు

ప్రధానాంశాలు

కేజీబీవీ సిబ్బందికి 180 ప్రసూతి సెలవులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేసే సిబ్బందికి 180 ప్రసూతి సెలవులు వర్తింపజేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గురువారం జీవో జారీ చేశారు. రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉండగా వాటిలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది అందరూ ఒప్పంద విధానంలో పనిచేసే మహిళలే. వారికి ఇద్దరు పిల్లల వరకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఆరు నెలలపాటు సెలవులో ఉన్నా వేతనం అందుతుంది. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం వర్తిస్తుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని