నవలలు, పరిశోధక రచనల పోటీ విజేతలు వీరే

ప్రధానాంశాలు

నవలలు, పరిశోధక రచనల పోటీ విజేతలు వీరే

ప్రకటించిన నాగభైరవ సాహిత్య పీఠం

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: ఒంగోలులోని నాగభైరవ సాహిత్య పీఠం జాతీయ స్థాయిలో నిర్వహించిన నవలలు, పరిశోధక రచనల పోటీలో ఎంపికైన విజేతల వివరాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ శనివారం ప్రకటించారు. నవలల పోటీ-2020లో సలీం (హైదరాబాద్‌) రచించిన ‘ఎడారి పూలు’ ప్రథమ బహుమతి, చేతన వంశీ(మంథని) ‘కోటిన్నొక్కడు’ ద్వితీయ బహుమతికి ఎంపికయ్యాయి. పరిశోధక రచనల పోటీ- 2021లో కడపకు చెందిన డాక్టర్‌ అనుపాటి సుబ్బారాయుడి ‘గాథా సప్తశతి-సౌందర్య గాథ’ ప్రథమ, నెల్లూరు జిల్లా కోటకు చెందిన డాక్టర్‌ పెళ్లూరు సునీల్‌ రచన ‘దీర్ఘ కవితా వికాసం’ ద్వితీయ బహుమతిని సాధించాయి.  ఈ ఏడాది నాటక పురస్కారానికి గుంటూరు జిల్లా జాలాదికి చెందిన నాటక రచయిత, దర్శకుడు జరుగుల రామారావు ఎంపికయ్యారు. నాగభైరవ ఆత్మీయ పురస్కారాన్ని చిన్ని నారాయణరావు(నెల్లూరు) స్వీకరించనున్నారు. విజేతలకు ఆగస్టు 15న ఒంగోలులోని నాగభైరవ అకాడమీలో పురస్కారాలు అందజేస్తామని ఆదినారాయణ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని