నేటి నుంచి ఎన్జీటీ కమిటీ ‘పాలమూరు’ పనుల పరిశీలన

ప్రధానాంశాలు

నేటి నుంచి ఎన్జీటీ కమిటీ ‘పాలమూరు’ పనుల పరిశీలన

ఈనాడు హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించడానికి బుధవారం నుంచి రెండు రోజులపాటు ఉన్నతస్థాయి కమిటీ పర్యటించనుంది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీలో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్‌ పరిశోధన సంస్థ (నీరి), కేంద్ర జలసంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధులతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌, తెలంగాణ గనులు, భూగర్భశాఖ సంచాలకుడు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రెండు రకాల అంశాలను పరిశీలించనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని