నేడు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ప్రధానాంశాలు

నేడు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న న్యాయమూర్తుల్లో పి.శ్రీసుధ, డాక్టర్‌ సీహెచ్‌.సుమలత, డాక్టర్‌ జి.రాధారాణి, ఎం.లక్ష్మణ్‌, ఎన్‌.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వరరెడ్డి, పి.మాధవిదేవి  ఉన్నారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ వీరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు హాజరుకానున్నారు. హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఏడుగురు.. అందులో నలుగురు మహిళలు ప్రమాణం చేయడం ఇదే మొదటిసారి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని