close
మహా నాగరికతను మింగిన భారీ కరవు

లాస్‌ ఏంజిలెస్‌: వాతావరణ కాటుకు ఒక గొప్ప పురాతన నాగరికత బలైందని తాజా అధ్యయనం తేల్చింది. ఉత్తర ఇరాక్‌లో క్రీస్తు పూర్వం 800-600 మధ్య కాలంలో ఒక వెలుగు వెలిగిన నియో-ఆస్సీరియన్‌ సామ్రాజ్యం 60 ఏళ్ల పాటు సాగిన పెను కరవుతో కుప్పకూలిందని వెల్లడైంది. ఈ అధ్యయనంలో భారత సంతతి శాస్త్రవేత్త ఆశీష్‌ సిన్హా పాలుపంచుకున్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో అప్పటివరకూ ఉనికిలో ఉన్న రాజ్యాల్లో నియో-అస్సీరియన్‌ సామ్రాజ్యమే అతిపెద్దది. పర్షియన్‌ గల్ఫ్‌లో అధిక భాగం అందులో ఉంది. నేటి సైప్రస్‌ వరకూ అది విస్తరించి ఉండేది. వాతావరణ సంబంధ ఇబ్బందులతో రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధాలు, వెలుపలి సైన్యాల దురాక్రమణలు వంటివి చోటుచేసుకున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఇది అంతిమంగా ఆ నాగరికతను కుప్పకూల్చిందని వివరించారు. తొలుత వరుస కరవులు చోటుచేసుకున్నాయని, ఫలితంగా వ్యవసాయం బాగా దెబ్బతిన్నదని చెప్పారు. భారీ స్థాయిలో సాగు నీరు అందించలేని స్థాయికి టైగ్రిస్‌ నది మారిపోయిందన్నారు. దీంతో దీర్ఘకాల కరవు రక్కసి వారిని కుంగదీసిందని చెప్పారు. ఉత్తర ఇరాక్‌లోని ‘కునా బా’ గుహలో శిలాజ రూపంలో ఉన్న నీటిని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ విషయం చెప్పారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.