కూలీల కోసం అందాల శౌచాలయం!

ప్రధానాంశాలు

కూలీల కోసం అందాల శౌచాలయం!

సాధారణంగా పట్టణాలు, నగరాల్లో జనం అత్యవసరాల కోసం సులభ్‌ కాంప్లెక్స్‌లు అందుబాటులో ఉంటాయి. పల్లెటూళ్లకు వెళ్తే ఆరుబయటకు వెళ్లాల్సి ఉంటుంది. తద్భిన్నంగా ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె)లో ప్రత్యేకంగా కూలీలు, ఇతరుల కోసం సామూహికంగా మరుగుదొడ్లు నిర్మించి ప్రత్యేకత చాటుతున్నారు. శౌచాలయ ప్రాంగణాన్ని అందమైన బొమ్మలు, పచ్చని మొక్కలతో తీర్చిదిద్దారు. జాతీయస్థాయిలో ఇప్పటికే ఎన్నో పురస్కారాలు ఆ పంచాయతీకి దక్కాయి. గ్రామంలో నూటికి నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించారు. కేంద్ర, రాష్ట్ర నిధులు రూ.3 లక్షలతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ నుంచి రూ.2 లక్షలు ఖర్చుచేసినట్లు సర్పంచి మీనాక్షి తెలిపారు.

- ఈనాడు, ఆదిలాబాద్‌; న్యూస్‌టుడే, ఇచ్చోడ


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని