APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-2 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

Updated : 14 Feb 2024 10:50 IST

అమరావతి: ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-2 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. 897 గ్రూప్‌-2 ఉద్యోగాలకు 4లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 25న రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్‌ పరీక్ష జరగనుంది. ఆరోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ) నిర్వహించనున్నారు. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకోవాలని సూచించారు. 

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని