TS ICET 2024: తెలంగాణ ఐసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

Telangana ICET | తెలంగాణలో ఐసెట్‌ దరఖాస్తుల గడువును మే 7 వరకు పొడిగించారు.

Updated : 01 May 2024 14:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఐసెట్‌ (TS ICET) దరఖాస్తులకు గడువు పొడిగించారు. మార్చి 5న  విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తులకు గడువు ముగియగా.. మే 7 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలస్య రుసుం లేకుండా మంగళవారం వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్‌ 5, 6 తేదీల్లో జరిగే ఈ పరీక్షకు రూ.250 ఆలస్య రుసుంతో మే 17 వరకు; రూ.500 ఆలస్య రుసుంతో మే 27 వరకు అప్లై చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. మే 28న హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. జూన్‌ 28న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని