BRAOU: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ బీఈడీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. ర్యాంకు కార్డును ఇలా పొందండి.

Updated : 27 Jun 2023 00:16 IST

హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం(BRAOU) దూర విద్యా విధానంలో బీఈడీ(B.Ed- ODL), బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)(Spl. B.Ed) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకు కార్డులను అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జూన్‌ 6న  బీఈడీ ఓడీఎల్‌ ప్రవేశ పరీక్షను ఉదయం 10.30గంటల నుంచి 12.30గంటల వరకు, అలాగే, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ప్రవేశ పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గటల వరకు నిర్వహించారు. బీఈడీ ఓడీఎల్‌ పరీక్షకు 6834 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, అందులో 5761 మంది అర్హత సాధించారు. ఇక బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షకు 2267 మంది రిజిస్టర్‌ చేసుకోగా, 1960 మంది అర్హులయ్యారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు విశ్వవిద్యాలయం పోర్టల్ www.braouonline.inలో అందుబాటులో ఉన్నాయని పరీక్షల నియంత్ర అధికారి డా. పరాంకుశం వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ర్యాంకు కార్డు కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని