TSPSC: గ్రూప్‌-4 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి..

TSPSC Group 4Exam Halltickets: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 4 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసి మీ హాల్‌టికెట్‌ పొందొచ్చు.

Updated : 24 Jun 2023 13:19 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-4 పరీక్ష(Group 4 Exam)కు సమయం సమీపిస్తుండటంతో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 1న జరిగే ఈ పరీక్ష కోసం హాల్‌టికెట్లను(TSPSC Group 4 Exam Halltickets) విడుదల చేశారు. జులై 1న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్‌ -1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్‌-2 పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 8వేలకు పైగా ఉద్యోగాలకు గతేడాది నోటిఫికేషన్‌ జారీ చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 9.5లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్నారు. 

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని