విదేశీ విద్యకు సర్కారీ సాయం!

ఉన్నతవిద్య అనగానే ఎక్కువగా మన విద్యార్థుల చూపు విదేశాల వైపే మళ్లుతోంది. ప్రతిభ, ఆసక్తి ఉండీ ఎంతోమంది ఆర్థిక కారణాలతో విదేశీ విద్య ఆలోచనకు దూరంఅవుతున్నారు. ఇలాంటివారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా  ఉపకార వేతనాలను అందిస్తోంది. వీటిలో ఎక్కువశాతం వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం రూపొందించినవే. ఆసక్తి ఉన్నవారు సంబంధిత సంస్థల వెబ్‌సైట్లలో ప్రకటించే నోటిఫికేషన్లు గమనించి, నిర్దిష్ట గడువు లోపు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది....

Published : 16 Mar 2020 00:19 IST

వివిధ పథÇకాల ద్వారా ఉపకార వేతనాలు

ఉన్నతవిద్య అనగానే ఎక్కువగా మన విద్యార్థుల చూపు విదేశాల వైపే మళ్లుతోంది. ప్రతిభ, ఆసక్తి ఉండీ ఎంతోమంది ఆర్థిక కారణాలతో విదేశీ విద్య ఆలోచనకు దూరంఅవుతున్నారు. ఇలాంటివారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా  ఉపకార వేతనాలను అందిస్తోంది. వీటిలో ఎక్కువశాతం వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం రూపొందించినవే. ఆసక్తి ఉన్నవారు సంబంధిత సంస్థల వెబ్‌సైట్లలో ప్రకటించే నోటిఫికేషన్లు గమనించి, నిర్దిష్ట గడువు లోపు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది.
ఉన్నతవిద్యను అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అభ్యసించాలనుకునే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ విద్య అంటే.. కోర్సు ఫీజు, నివాసం, ఆహారం, ఇతర ఖర్చులు.. ఎంతో భారం. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం  ప్రతిభ గల విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా కొన్ని స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయాలు/ కళాశాలల్లో ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, అప్లయిడ్‌ సైన్సెస్‌, అగ్రికల్చరల్‌ సైన్సెస్‌, మెడిసిన్‌, కామర్స్‌, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ మొదలైన వివిధ విభాగాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునేవారు వీటికి అర్హులవుతారు. ఒక్కో స్కీమునుబట్టి అందుకునేవారి సంఖ్యలో మార్పులున్నాయి. వాటిలో ప్రముఖమైన వాటి వివరాలు చూద్దాం..

 


నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ స్టూడెంట్స్‌
ఎవరు? ఎవరికి?: గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అందిస్తోంది. వెనుకబడిన తెగలకు చెందిన ప్రతిభావంతులకు దీనిని అందజేస్తారు.
విద్యాస్థాయి: మాస్టర్స్‌ కోర్సులు, పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టొరల్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌లు
విభాగాలు: ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌/ ఫైనాన్స్‌, సైన్స్‌, అప్లయిడ్‌ సైన్స్‌, అగ్రికల్చర్‌, మెడిసిన్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌సైన్సెస్‌
ఎన్ని?:  ఏడాదికి 20. అమ్మాయిలకు 30% కేటాయించారు.
అర్హతలు: కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.6 లక్షలు మించకూడదు. గత తరగతిలో 55% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌ తప్పనిసరి. వయసు 35కు మించకూడదు.
ఎంత మొత్తం? ఆఫర్‌ లెటర్‌ ఆధారంగా ట్యూషన్‌ ఫీజు, నివాస ఖర్చులు, పుస్తకాల ఖర్చులు, టికెట్‌ ఖర్చులను అందజేస్తారు.

https://tribal.nic.in/nos.aspx
 


నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్‌ స్టూడెంట్స్‌
ఎవరు? ఎవరికి?: సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ దీనిని వెనుకబడిన తరగతులవారికి అందజేస్తోంది.  
విద్యాస్థాయి: మాస్టర్‌ స్థాయి, పీహెచ్‌డీ కోర్సులు
విభాగాలు: ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌; సైన్స్‌, అప్లయిడ్‌, అగ్రికల్చర్‌ సైన్సెస్‌, మెడిసిన్‌; కామర్స్‌, అకౌంటింగ్‌, ఫైనాన్స్‌
ఎన్ని?: ఏడాదికి 100.
అర్హతలు: కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.6 లక్షలు మించకూడదు. గత తరగతిలో 55% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌ను సాధించి ఉండాలి. వయసు 35కు మించకూడదు.
ఎంత మొత్తం? ఆఫర్‌ లెటర్‌ ఆధారంగా ట్యూషన్‌ ఫీజు, నివాస, పుస్తకాల ఖర్చులు, టికెట్‌ ఖర్చులను అందజేస్తారు.

http://socialjustice.nic.in/SchemeList/Send/28?mid=24541
 


మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్‌ విద్యానిధి
ఎవరు? ఎవరికి?: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ బీసీ, ఈబీసీ వారికి అందజేస్తోంది.
విద్యాస్థాయి: మాస్టర్స్‌ స్థాయి కోర్సులు
విభాగాలు: ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ అండ్‌ నర్సింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌, అగ్రికల్చర్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌
ఎన్ని?: 300
అర్హతలు: వయసు 30 ఏళ్లు మించకూడదు. డిగ్రీస్థాయిలో 60% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో నివసించేవారైతే ఏడాదికి రూ.1,50,000, పట్టణాల్లో నివసించే వారైతే ఏడాదికి రూ.2 లక్షలు మించకూడదు.
ఎంత మొత్తం? రూ. 20 లక్షలు. ఏడాదికి రూ.10 లక్షలు చొప్పున  రెండేళ్లపాటు చెల్లిస్తారు.

https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.jsp


డాక్టర్‌ అంబేడ్కర్‌ స్కీమ్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ సబ్సిడీ ఆన్‌ ఎడ్యుకేషనల్‌ లోన్స్‌ ఫర్‌ ఓవర్సీస్‌ స్టడీస్‌ ఫర్‌ ఓబీసీ, ఈబీసీస్‌

ఎవరు? ఎవరికి?: సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ దీనిని ఓబీసీ (అదర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌), ఈబీసీ (ఎకనామికల్లీ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌)కు అందిస్తోంది.
విద్యాస్థాయి: పీజీ డిప్లొమా, మాస్టర్స్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ స్థాయి కోర్సులు
విభాగాలు: ఏ విభాగం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్ని?: నిర్ణీత సంఖ్య ఏమీలేదు
అర్హతలు: ఎడ్యుకేషన్‌ లోన్‌ స్కీం కింద షెడ్యూల్డ్‌ బ్యాంకులో రుణం పొంది ఉండాలి.
ఎంత మొత్తం? మారటోరియం/ ఇంట్రెస్ట్‌ సబ్సిడీ (స్టడీ పీరియడ్‌తోపాటు ఏడాది లేదా కోర్సు పూర్తయ్యి ఉద్యోగం వచ్చాక ఆరు నెలల సమయం వరకూ తీసుకున్న రుణంపై వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది)

http://socialjustice.nic.in/writereaddata/UploadFile/Scheme of Interest
Subsidy636181089437985140.pdf


ఓవర్సీస్‌ డాక్టొరల్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌
ఎవరు? ఎవరికి?: ద సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ బోర్డ్‌ పరిశోధనపై ఆసక్తి ఉన్నవారికి అందజేస్తోంది.
విభాగాలు: సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌
ఎన్ని?: నిర్ణీత సంఖ్య ఏమీ లేేదు
అర్హతలు: ప్రముఖ విద్యాసంస్థలు- కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మొదలైన వాటిల్లో పరిశోధన ఆమోదం పొందినవారికి.
ఎంత మొత్తం? నాలుగేళ్లపాటు నెలకు 2000 డాలర్లు

http://www.serb.gov.in/odf.php


పఢో పర్‌దేశ్‌
ఎవరు? ఎవరికి?: మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మైనారిటీ కమ్యూనిటీలవారికి (ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు మొదలైనవారు) అందిస్తోంది.
విద్యాస్థాయి: మాస్టర్స్‌ స్థాయి కోర్సులు, ఎంఫిల్‌, పీహెచ్‌డీ
విభాగాలు: ఏ విభాగం వారైనా అర్హులే.
ఎన్ని?: ఏడాదికి 400
అర్హతలు: కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.ఆరు లక్షలు మించకూడదు.
ఎంత మొత్తం? మారటోరియం/ ఇంట్రెస్ట్‌ సబ్సిడీ (స్టడీ పీరియడ్‌తోపాటు ఏడాది లేదా కోర్సు పూర్తయ్యి ఉద్యోగం వచ్చాక ఆరు నెలల సమయం వరకూ తీసుకున్న లోనుపై వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది)

http://minorityaffairs.gov.in/schemesperformance/padho-pardesh-scheme-interest-subsidy-educational-loans-overseas-studies-students-belonging-minority


ఇవే కాకుండా...
కల్చరల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌ కింద ఇటలీ, మెక్సికో, ఇజ్రాయెల్‌, చైనా, దక్షిణ కొరియా, హంగేరీ, కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్‌ (న్యూజీలాండ్‌), కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్‌ (యూకే) దేశాలు వారి సంస్థల్లో చదివే భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. ఇందుకుగానూ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నామినేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తుంది.
*ఏఐసీటీఈ మేథమేటిక్స్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కంప్యూటర్‌ సిస్టమ్స్‌తో కలిసి ‘స్టూడెంట్‌ అబ్రాడ్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇంటర్న్‌షిప్స్‌’ కల్పిస్తోంది. దీని కింద ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులకు కెనడియన్‌ విశ్వవిద్యాలయాల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం కలుగుతుంది.
* హంగేరీ, భారత్‌ మధ్య ఎడ్యుకేషన్‌ ఎక్చేంజ్‌ ప్రోగ్రామ్‌ కింద హంగేరియన్‌ ప్రభుత్వం మన విద్యార్థులకు 200 స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. అయితే అక్కడి విద్యాసంస్థల్లో చదివేవారికే వీటిని పొందే అవకాశముంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని