కరెంట్‌ అఫైర్స్‌

ఇండియన్‌ సొసైటీ ఫర్‌ నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ (ఐఎస్‌ఎన్‌టీ) ఈ ఏడాదికిగానూ కొండల్‌రావు మెమోరియల్‌ అవార్డును ఏ శాస్త్రవేత్తకు ప్రదానం చేసింది?

Published : 05 Dec 2022 03:19 IST

మాదిరి ప్రశ్నలు

* ఇండియన్‌ సొసైటీ ఫర్‌ నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ (ఐఎస్‌ఎన్‌టీ) ఈ ఏడాదికిగానూ కొండల్‌రావు మెమోరియల్‌ అవార్డును ఏ శాస్త్రవేత్తకు ప్రదానం చేసింది?

జ: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త జైతీర్థ్‌  రాఘవేంద్ర జోషి


* భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేస్తోన్న సరికొత్త రాకెట్‌ ఏది? (1980వ దశకంలో రూపొందించిన పీఎస్‌ఎల్‌వీ ప్రస్తుత అవసరాలను తీర్చలేకపోవడంతో దాని స్థానంలో ఈ కొత్త రాకెట్‌ను అభివృద్ధి చేస్తున్నారు)

జ: ఎన్‌జీఎల్‌వీ (నెక్ట్స్‌ జనరేషన్‌ లాంచ్‌ వెహికల్‌)


* ఎరువుల తయారీ, విద్యుత్తు ఉత్పత్తి కోసం ఉపయోగించే సహజ వాయువు ధరను కేంద్ర ప్రభుత్వం 2022, అక్టోబరు 1 నుంచి ఎంత శాతం పెంచింది? 

 జ: 40 శాతం


* 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంత మొత్తంగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది? (నిరుడు ఇదే కాలంలో వసూలైన ప్రత్యక్ష పన్నుల కంటే ఈసారి 23.8 శాతం అధికంగా వసూలైనట్లు ప్రకటించింది) 

జ: రూ. 8.98 లక్షల కోట్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని