కరెంట్‌ అఫైర్స్‌

2023 ఏడాదికి ప్రతిష్ఠాత్మక 58వ జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు?

Published : 05 May 2024 00:45 IST

మాదిరి ప్రశ్నలు

2023 ఏడాదికి ప్రతిష్ఠాత్మక 58వ జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు?

జ: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్‌ (సంపూరణ్‌ సింగ్‌ కాల్రా), సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య (ఉర్దూకు ఈ అవార్డు దక్కడం ఇది అయిదోసారి కాగా, సంస్కృతానికి రెండోసారి వచ్చింది).

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (ప్రపంచంలోనే తొలిసారిగా 1962లో ఇదే రోజున నాటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ అమెరికా పార్లమెంటులో ప్రసంగిస్తూ వినియోగదారుల హక్కుల గురించి ప్రస్తావించారు. అనంతరం 1983 నుంచి ఏటా ఈ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరపాలని లండన్‌కు చెందిన ‘కన్జ్యూమర్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ నిశ్చయించింది. ఈ ఏడాది ‘వినియోగదారుల కోసం న్యాయబద్ధంగా, బాధ్యతాయుతంగా కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించడం’ అనే నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు.)

జ: మార్చి 15

2022లో వాయునాణ్యత అత్యంత తక్కువగా ఉన్న 131 దేశాల్లో భారత్‌ ఎన్నో స్థానంలో నిలిచినట్లు స్వీడన్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ సంస్థ వెల్లడించింది? (ఒక్క వాయు కాలుష్యం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 67 లక్షల మంది చనిపోతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. కలుషితగాలిని పీలుస్తుండటంతో దిల్లీవాసుల జీవితకాలం సగటున 11.9 ఏళ్లు తరిగిపోతున్నట్లు షికాగోలోని ‘ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌’ లెక్కగట్టింది.)

జ: ఎనిమిదో స్థానం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని