BEL Recruitment: బీటెక్ చదివారా..? బెల్‌లో 205 ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే?
బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ బెల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
బెంగళూరు: నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 205 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. వీటిలో 191 ట్రైనీ ఇంజినీర్, 14 ప్రాజెక్టు ఇంజినీర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 24 వరకు https://jobapply.in/bel2023JUNBNG/ వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..
- అర్హత: ఏఐసీటీఏ గుర్తించిన ఇంజినీరింగ్ కళాశాల నుంచి బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న జాబ్ కోడ్‌లను బట్టి ఆయా విభాగాల్లో కనీస అనుభవం కలిగి ఉండాలి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 55శాతం మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులైతే పాసైతే చాలు.
- ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. బెంగళూరు వేదికగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- దరఖాస్తు రుసుం: ప్రాజెక్టు ఇంజినీర్-1 పోస్టులకు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472లు కాగా.. ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.177. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష పీజు నుంచి మినహాయింపు
- వేతనం/కాంట్రక్టు వివరాలు: ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకైతే తొలుత అభ్యర్థులను మూడేళ్లకు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.40 వేలు, రెండో సంవత్సరంలో నెలకు రూ.50వేలు, మూడో ఏడాది నెలకు రూ.55వేలు చొప్పున ఇస్తారు. అదే ట్రైనీ ఇంజినీర్ పోస్టులకైతే తొలుత రెండేళ్లకే ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టు అవసరాన్ని బట్టి గరిష్ఠంగా ఒక ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో తొలి ఏడాది నెలకు రూ.30వేలు చొప్పున, రెండో ఏడాది రూ.35వేలు చొప్పున వేతనం చెల్లిస్తారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు