మధుమేహులకు ఉపవాస మేలు

మధుమేహానికి ఊబకాయం కలిస్తే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. ఇది రక్తంలో గ్లూకోజు నియంత్రణను దెబ్బతీస్తుంది. అందుకే మధుమేహం గలవారు బరువు తగ్గించుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు.

Updated : 09 Jan 2024 04:28 IST

ధుమేహానికి ఊబకాయం కలిస్తే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. ఇది రక్తంలో గ్లూకోజు నియంత్రణను దెబ్బతీస్తుంది. అందుకే మధుమేహం గలవారు బరువు తగ్గించుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇందుకోసం ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ఆహారంలో కేలరీలను తగ్గించుకోవటం. కానీ దీన్ని పాటించటంలో చాలామంది వెనక పడుతుంటారు. మరెలా? దీన్ని దృష్టిలో పెట్టుకునే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు వేరే పద్ధతిని గుర్తించటంపై అధ్యయనం నిర్వహించారు. మధుమేహం, ఊబకాయం రెండూ గలవారిని ఎంచుకొని, మూడు బృందాలుగా విభజించారు. ఒక బృందానికి నిర్ణీత కాల ఉపవాసం చేయాలని సూచించారు. వీళ్లు మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల లోపే ఆహారం తిన్నారు. మరో బృందం 25% కేలరీలు తగ్గించుకోగా.. ఇంకో బృందం ఎలాంటి ఆహార నియమాలు పాటించలేదు. ఆరు నెలల తర్వాత పరిశీలించగా.. నిర్ణీతకాల ఉపవాసం పాటించినవారు తమ శరీర బరువులో సగటున 3.6% తగ్గినట్టు తేలింది. కేలరీలు తగ్గించుకున్నవారు పెద్దగా బరువు తగ్గలేదు. అయితే రెండు బృందాల్లోనూ గ్లూకోజు తగ్గటం విశేషం. బరువు తగ్గేందుకు సంప్రదాయ ఆహార పద్ధతులు పాటించటంలో ఇబ్బంది పడేవారికి నిర్ణీతకాల ఉపవాసం మేలు చేస్తున్నట్టు ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అయితే మధుమేహులు దీన్ని పాటించటానికి ముందు డాక్టర్‌ సలహా తీసుకోవటం తప్పనిసరని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని