చిన్నారి మాట బంగారుబాట!

ఈ చిన్నారి మాట్లాడిందంటే అందరూ నోరెళ్ల బెట్టి చూడాల్సిందే! చప్పట్లతో ప్రశంసల జల్లు కురిపించాల్సిందే! తన మాటలతో అందరినీ అంతలా ప్రభావితం చేస్తుంది. అలా తన ప్రతిభతో అవార్డులూ అందుకుంటోంది. ఇంతకీ తనెవరు? ఏం మాట్లాడుతోంది? ఆ వివరాలన్నీ తెలుసుకుందాం రండి..

Published : 28 Sep 2021 00:21 IST

ఈ చిన్నారి మాట్లాడిందంటే అందరూ నోరెళ్ల బెట్టి చూడాల్సిందే! చప్పట్లతో ప్రశంసల జల్లు కురిపించాల్సిందే! తన మాటలతో అందరినీ అంతలా ప్రభావితం చేస్తుంది. అలా తన ప్రతిభతో అవార్డులూ అందుకుంటోంది. ఇంతకీ తనెవరు? ఏం మాట్లాడుతోంది? ఆ వివరాలన్నీ తెలుసుకుందాం రండి..

హైదరాబాద్‌కు చెందిన అనికా అగర్వాల్‌. వయసు 13 సంవత్సరాలు. అనికకి చిన్నప్పట్నుంచి అభ్యుదయ భావాలు ఎక్కువ. దానివల్లనే సోషల్‌ యాక్టివిస్టుగా మారిపోయింది. అంతేకాదు వక్తగా మారి అందరితో శభాష్‌ అనిపించుకుంటుంది. ఇందుకు అమ్మానాన్న కూడా ప్రోత్సాహం అందించడంతో, అటు చదువుకుంటూనే ఇటు సమాజసేవ చేస్తోంది.  

స్ఫూర్తిగా నిలుస్తూ..

అనిక సమాజ సేవకు సంబంధించి ఎక్కడ కార్యక్రమాలు జరిగినా వెళుతుంది. మొదట్లో మాట్లాడటానికి అవకాశం అడిగేది. కానీ ఇప్పుడు తనకే ముందు కార్యక్రమ వివరాలు చెప్పి మరీ మాట్లాడమంటున్నారు. ఇక అనిక మాట్లాడటం మొదలు పెట్టిందంటే అందరూ వినడానికి భలే ఆసక్తి చూపిస్తారు. అంత చక్కగా వివరిస్తుంది మరి. బాలికల సంరక్షణ, మహిళా సాధికారత వంటి అంశాల గురించి చర్చిస్తుంది. జంతుసంరక్షణ గురించి తెలియజేస్తుంది. సమాజ పోకడల్ని, స్థితిగతుల్ని చెబుతూ అక్కడున్న వారిని చైతన్యపరుస్తుంది. అలా బెస్ట్‌ మోటివేషన్‌ స్పీకర్‌ అయిపోయింది. ఇంత చిన్న వయసులో అంతలా సమాజ పరిస్థితుల్ని అర్థం చేసుకుని మాట్లాడటం మామూలు విషయం కాదు. అందుకే చిన్నారులను సైతం మోటివేట్‌ చేస్తున్నందుకు అనికకు ‘నేతాజీ బాల్‌ ప్రేరణ’ పురస్కారాన్ని ఇచ్చేశారు. ఈ మధ్య ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో కూడా స్థానం సంపాదించుకుంది. అదీ అనిక అంటే! మరి అనికకు మనమూ అభినందనలు తెలిపేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని