నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అంతే కదా..!

Published : 27 Apr 2024 00:20 IST

అంతే కదా..!

డాక్టర్‌: కొన్ని రోజుల వరకు ఆకు కూరలు, చిరుధాన్యాలు ఎక్కువగా తినండి. ఆరోగ్యం బాగవుతుంది..!

పేషెంట్‌: అయితే.. ప్రతిరోజు మేక, కోడి మాంసం తినమంటారా?

డాక్టర్‌: ఇప్పుడే కదా.. ఆకు కూరలు, చిరుధాన్యాలు తినాలని చెప్పాను..!

పే షెంట్‌: అంటే.. మేకలు అన్ని రకాల ఆకులు, కోళ్లు అన్ని చిరుధాన్యాలు తింటాయి కాబట్టి, నేను వాటిని తింటా!

అందుకనే..!

చిన్ని: ఎందుకు మిన్నీ.. చాక్లెట్లు కావాలని దేవుడి ముందు నిలబడి అంత గట్టిగా అరుస్తున్నావు? మెల్లగా చెప్పినా తెలుస్తుంది కదా?

మిన్ని: దేవుడికి తెలుస్తుంది కానీ.. మా నాన్నకి వినిపించాలని గట్టిగా చెబుతున్నా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని