పొడుపు కథలు

1. చీకటి పడేసరికి మా దొడ్లోకి తెల్లని ఆవులొస్తాయి. తెల్లారేసరికి అన్నీ మాయమైపోతాయి?మా తాత రెండు ఎడ్లను కొన్నాడు.. అవి నీళ్లను చూస్తే ఆగిపోతాయి.. ఏంటవి?ముగ్గురు రాజులకు కలిపి ఒకటే టోపీ?

Published : 28 Aug 2020 00:55 IST

1. చీకటి పడేసరికి మా దొడ్లోకి తెల్లని ఆవులొస్తాయి. తెల్లారేసరికి అన్నీ మాయమైపోతాయి?

2. మా తాత రెండు ఎడ్లను కొన్నాడు.. అవి నీళ్లను చూస్తే ఆగిపోతాయి.. ఏంటవి?

3. ముగ్గురు రాజులకు కలిపి ఒకటే టోపీ?


ఎవరు నేను?

సంస్కారంలో ఉన్నా.. సంస్కృతంలోనూ ఉన్నా.. కానీ నమస్కారంలో లేను. ఆపదలో ఉన్నా.. పదవిలోనూ ఉన్నా.. కానీ ఆలోచనలో మాత్రం లేను. ఇంతకీ ఎవరు నేను?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


అవాక్కయ్యారా?

ఓ ఖండమంతా విస్తరించి ఉన్న ఏకైక దేశం ఆస్ట్రేలియా.

ఊసరవెల్లి.. నాలుకను తన శరీరం కంటే మూడు రెట్లు ఎక్కువ దూరం చాచగలదు!

ప్రపంచంలో 30,000 రకాలకు పైగా చేపలున్నాయి.


రంగులు వేద్దామా..


తమాషా ప్రశ్నలు

: 1.ఏడు గుడ్లు ఉంటాయి. (డైనోసర్లు ఎప్పుడో అంతరించాయి కదా!)

2.నీ దగ్గర 8 ఆపిల్‌ పండ్లు ఉంటాయి. (నువ్వు ఎనిమిదే తీసుకున్నావ్‌గా!)

3. "one" ముందు "g" పెట్టాలి. అప్పుడు "gone" అవుతుంది.




జవాబులు: పొడుపు కథలు: 1.నక్షత్రాలు 2.చెప్పులు 3.తాటికాయ ఎవరు నేను?: ‘సంపద’ అనే పదం 6 తేడాలు కనుక్కోండి: 1.ఎలుగు చెవి, 2.కాలు, 3.తేనె, 4.రాయి, 5.పొద, 6.ఉడుత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని