నవ్వుల్‌.. నవ్వుల్‌!

తాతయ్య: చింటూ.. ఎందుకలా పురుగుల్ని చంపుతావ్‌.. జీవహింస పాపం.. వాటిని వదిలేయ్‌!

Updated : 10 Aug 2021 01:40 IST

చింటూ చెప్పిందీ పాయింటే!

తాతయ్య: చింటూ.. ఎందుకలా పురుగుల్ని చంపుతావ్‌.. జీవహింస పాపం.. వాటిని వదిలేయ్‌!

చింటు: ఆ ముక్క వాటికీ చెప్పండి తాతయ్య. వాటిని పట్టుకున్నందుకు అప్పటి నుంచి తెగ కరుస్తున్నాయ్‌ నన్ను..!

తాతయ్య: ఆఁ!!

బంటి బాధ బంటిది!

అమ్మ: కొట్టుకెళ్లి అన్నీ తెచ్చావ్‌. కరివేపాకు తప్ప! మరిచిపోయావా బంటీ?

బంటి: లేదమ్మా మరిచిపోలేదు.

అమ్మ: మరి?

బంటి: నువ్వు కూరలో వేసినా.. తినేటప్పుడు తీసి అవతల పారేస్తున్నాం కదా..! ఎందుకు ఖర్చు దండగ అని నేనే తెలేదు అమ్మా!

అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని