ఇక నిమిషాల్లో బిసి బెలే బాత్‌!

కన్నడిగుల వంటల్లో మనకు బాగా నచ్చేది బిసి బెలె బాత్‌. తరచూ చేసి, ఇష్టంగా తింటాం కనుక ఇదసలు మనదే అనిపిస్తుంది.

Updated : 19 May 2024 05:05 IST

న్నడిగుల వంటల్లో మనకు బాగా నచ్చేది బిసి బెలె బాత్‌. తరచూ చేసి, ఇష్టంగా తింటాం కనుక ఇదసలు మనదే అనిపిస్తుంది. అయితే.. అప్పటికప్పుడు అన్ని దినుసులనూ వేయించి, నూరాలంటే కొంచెం పెద్ద ప్రహసనమని.. పౌడర్‌ కొనుక్కుంటాం. అందులో నిలవుండేందుకు రసాయనాలు కలుపుతారు. అందువల్ల ఈ పొడిని ఇంట్లోనే చేసుకుందామా.. ఇది చేసేందుకు.... శనగ పప్పు, ధనియాలు 4 చెంచాల చొప్పున, ఎండుకొబ్బరి తురుము 3 చెంచాలు, మినప్పప్పు, గసగసాలు 2 స్పూన్ల చొప్పున, నువ్వులు, ఆవాలు, జీలకర్ర చెంచా చొప్పున ఎండుమిరపకాయలు 12, లవంగాలు 3, యాలకులు 2, ఇంగువ ముప్పావు చెంచా, మిరియాలు అర చెంచా, దాల్చినచెక్క అంగుళం ముక్క, కరివేపాకు ఒక కట్ట, పావు చెంచా మెంతులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఎలా చేయాలంటే.... కడాయిలో ఆవాలు, శనగ పప్పు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలను ఒక దాని తర్వాత ఒకటి చొప్పున వేసి వేయించాలి. అవి మంచి వాసన వస్తుండగా పü˘్లంలోకి తీసి.. నువ్వులు, గసగసాలను వేయించి తీయాలి. తర్వాత.. దాల్చినచెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులను వేయించాలి. వాటిని కూడా తీసి.. కరివేపాకు, ఎండు మిరపకాయలను.. అవీ వేగాక.. కొబ్బరి తురుమును వేయించాలి. అన్నిటినీ చల్లారనిచ్చి.. ఇంగువ జతచేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. దీన్ని తడి లేని, గాలిచొరబడని సీసాలో భద్రం చేసుకుంటే సరి.. ఎప్పుడంటే అప్పుడు ‘బిసి బెలె బాత్‌’ చేసుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని