పావుగంటలో ఛాట్‌ మసాలా పౌడర్‌

ఛోలే, భేల్‌పురి, ఆలూ ఛాట్‌, ఫ్రూట్‌ ఛాట్‌, సలాడ్‌, పకోడీలు.. ఇలా అనేక పదార్థాల్లో ఛాట్‌ మసాలా వేస్తాం. ఆ రుచీ, వాసన ఎంతగా నోరూరిస్తుందో మనందరికీ తెలిసిందే!

Published : 17 Mar 2024 00:11 IST

ఛోలే, భేల్‌పురి, ఆలూ ఛాట్‌, ఫ్రూట్‌ ఛాట్‌, సలాడ్‌, పకోడీలు.. ఇలా అనేక పదార్థాల్లో ఛాట్‌ మసాలా వేస్తాం. ఆ రుచీ, వాసన ఎంతగా నోరూరిస్తుందో మనందరికీ తెలిసిందే! ఇంతకీ దాన్ని కొనుక్కోకుండా ఇంట్లోనే చేయలేమా- అంటే.. సంతోషంగా చేసుకోవచ్చు. ఛాట్‌ మసాలా పౌడర్‌ చేసేందుకు ధనియాలు, జీలకర్ర పావు కప్పు చొప్పున, ఎండుమిర్చి రెండు, డ్రై జింజర్‌ పౌడర్‌ చెంచా, మిరియాలు రెండు టేబుల్‌ స్పూన్లు, ఏడెనిమిది లవంగాలు, సగం జాజికాయ, ఆమ్‌చూర్‌ పౌడర్‌ పావు చెంచా, ఇంగువ అరచెంచా, పుదీనా ముప్పావు కప్పు, చెంచా ఉప్పు తీసుకోవాలి. కడాయిలో పుదీనా ఆకులు వేసి.. సన్న సెగ మీద వేయించి పళ్లెంలోకి తీయాలి. అదే కడాయిలో జీలకర్ర, ధనియాలు వేయించాలి. అవి తీసి.. మిరియాలు, లవంగాలు, జాజికాయ ఎండు మిర్చి వేసి వేయించాలి. మంచి సువాసన వస్తున్నప్పుడు వీటిని కూడా తీసి పళ్లెంలో వేయాలి. చల్లారాక అన్నిటినీ మిక్సీ జార్‌లో వేసి.. డ్రై జింజర్‌ పౌడర్‌, ఆమ్‌చూర్‌ పౌడర్‌, ఇంగువ, ఉప్పు జతచేసి గ్రైండ్‌ చేస్తే ఘుమఘుమలాడే ఛాట్‌ మసాలా పౌడర్‌ రెడీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని