గరం మసాలా ఇలా చేయండి!

పనీర్‌, టొమాటో, బంగాళదుంప లాంటి శాకాహారాలు, చికెన్‌, మటన్‌ లాంటి మాంసాహారాలు, బిర్యానీ, ఫ్రైడ్‌ రైస్‌.. ఇలా ఏవైనా సరే స్పైసీగా ఉండాలంటే గరం మసాలా జోడించేస్తాం.

Published : 03 Mar 2024 00:39 IST

నీర్‌, టొమాటో, బంగాళదుంప లాంటి శాకాహారాలు, చికెన్‌, మటన్‌ లాంటి మాంసాహారాలు, బిర్యానీ, ఫ్రైడ్‌ రైస్‌.. ఇలా ఏవైనా సరే స్పైసీగా ఉండాలంటే గరం మసాలా జోడించేస్తాం. ఒక్క చెంచా వేస్తే చాలు.. అద్భుతమైన రుచి వచ్చేస్తుంది. ఇంత ముఖ్యమైన గరం మసాలాని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాగంటారా.. కడాయిలో అర కప్పు జీలకర్రను వేయించి ఒక పళ్లెంలోకి తీయాలి. సగం జాజికాయ. మిరియాలు, లవంగాలు, యాలకులు రెండు చెంచాల చొప్పున, నాలుగు బిర్యానీ ఆకులు, అంగుళమంత దాల్చినచెక్కలు 3, జాపత్రి కొద్దిగా, స్టార్‌ మొగ్గలు, బ్లాక్‌ కార్డమమ్‌లు మూడు చొప్పున తీసుకుని.. వీటిని కూడా వేయించి.. మంచి వాసన వస్తున్నప్పుడు జీలకర్ర ఉన్న పళ్లెంలోకి తీయాలి. అదే కడాయిలో అర కప్పు ధనియాలు, నాలుగు ఎండుమిర్చిలను వేయించాలి. వాటిని కూడా తీసి.. రెండు చెంచాలు సోంపు వేయించాలి. అన్నీ వేయించడం అయ్యాక.. చల్లారనిచ్చి గ్రైండ్‌ చేయాలి. అంతే ఘుమఘుమలాడే గరం మసాలా తయారైపోతుంది. దీన్ని తడి లేని, గాలి చొరబడని సీసాలో భద్రం చేస్తే.. చాన్నాళ్లు నిలవుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని