ఆమ్‌చూర్‌ పౌడర్‌ చేద్దామా!

కూరలు, చిరుతిళ్లలో ఆమ్‌చూర్‌ పౌడర్‌ వాడుతుంటాం. కొన్నిసార్లు చారులో కూడా చింతపండు లేదా నిమ్మరసానికి బదులు దీన్నే వేస్తాం. సమోసా చాట్, శాండ్‌విచ్‌ల్లోనూ ఇదుండాల్సిందే!

Published : 09 Jun 2024 00:43 IST

కూరలు, చిరుతిళ్లలో ఆమ్‌చూర్‌ పౌడర్‌ వాడుతుంటాం. కొన్నిసార్లు చారులో కూడా చింతపండు లేదా నిమ్మరసానికి బదులు దీన్నే వేస్తాం. సమోసా చాట్, శాండ్‌విచ్‌ల్లోనూ ఇదుండాల్సిందే! ఆ రుచి అలాంటిది. ఇంత ముఖ్యమైన ఆమ్‌చూర్‌ పౌడర్‌ని కొనకుండా ఇంట్లోనే చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది కదూ?! ఇదేదో పెద్ద ప్రహసనం అనుకుంటున్నారా.. ఉహూ, చాలా తేలిగ్గా చేసేయొచ్చు. దీనికి పచ్చి మామిడికాయలు, కాస్తంత ఉప్పు ఉంటే చాలు. కాయలు మాత్రం చాలా పుల్లగా ఉండేవాటిని ఎంచుకోవాలి. నాలుగు కాయలకు అర చెంచా ఉప్పు పడుతుంది.
మామిడికాయలను కడిగి, చెక్కు తీసి.. ఒక అర గంటసేపు నీళ్లలో ఉంచాలి. లేకుంటే రంగు మారి, నల్లగా అవుతాయి. తర్వాత బయటకు తీసి, తుడిచి.. చిప్స్‌ కటర్‌తో స్లైసులుగా కోయాలి. అవి వీలైనంత సన్నగా ఉండాలి. లేదంటే సరిగ్గా ఎండవు. అన్నీ అయ్యాక శుభ్రమైన వస్త్రం మీద పరచి.. పగలు ఎండలో, రాత్రి లోనికి తెచ్చి ఫ్యాన్‌ కింద ఎండబెట్టాలి. ఇలా మూడు రోజులు చేయాలి. వీటికి ఉప్పు జతచేసి, గ్రైండ్‌ చేయాలి. చాలా మెత్తగా ఉండాలి కనుక.. జల్లెడపట్టి, మళ్లీ గ్రైండ్‌ చేయాలి. ఈ ఆమ్‌చూర్‌ పౌడర్‌ను తడి లేని, గాలి చొరబడని సీసాలో భద్రంచేస్తే.. ఆరు నెలలు నిలవుంటుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు