మసాలా మ్యాజిక్‌ పౌడర్‌ ఇంట్లోనే చేద్దామా..

కూరలకు అదనపు రుచి తెప్పించేందుకు వాటిల్లో ఏవో పౌడర్లు వేస్తుంటాం. ముఖ్యంగా ‘మసాలా మ్యాజిక్‌’ అంటూ మార్కెట్లో దొరుకుతున్న పౌడర్‌ వేశామంటే.. హోటల్‌ కర్రీలా సూపర్‌గా ఉంటుంది. కానీ కొన్నదానితో రుచి వచ్చిందంటే

Published : 07 Apr 2024 00:28 IST

కూరలకు అదనపు రుచి తెప్పించేందుకు వాటిల్లో ఏవో పౌడర్లు వేస్తుంటాం. ముఖ్యంగా ‘మసాలా మ్యాజిక్‌’ అంటూ మార్కెట్లో దొరుకుతున్న పౌడర్‌ వేశామంటే.. హోటల్‌ కర్రీలా సూపర్‌గా ఉంటుంది. కానీ కొన్నదానితో రుచి వచ్చిందంటే.. అందులో మన గొప్పేం ఉందిలే అనిపిస్తుంది. అలాంటి అసంతృప్తి లేకుండా ఆ పౌడర్‌ను మనమే చేద్దామా?! దీన్ని చేసేందుకు.. పావు కప్పు ధనియాలు, 2 టేబుల్‌ స్పూన్ల జీలకర్ర, చెంచా చొప్పున పంచదార, ఆనియన్‌ పౌడర్‌, ఆమ్‌చూర్‌ పొడి, సోంపు, ఏడు లవంగాలు, ఆరు యాలకులు, దాల్చినచెక్క అంగుళం ముక్క, అర చెంచా చొప్పున వెల్లుల్లిపొడి, డ్రై జింజర్‌ పొడి, మిరియాలు, టేబుల్‌ స్పూన్‌ కారం, అర టేబుల్‌ స్పూన్‌ చొప్పున మొక్కజొన్న పిండి, పసుపు, పావు చెంచా మెంతులు, 2 బిర్యానీ ఆకులు, రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి.

కడాయిలో ధనియాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వేసి సన్న సెగ మీద వేయించాలి. మంచి ఘుమాయింపు వస్తుండగా స్టవ్వు కట్టేయాలి. అవి చల్లారాక.. కారం, పసుపు, డ్రై జింజర్‌ పొడి, వెల్లుల్లిపొడి, ఆనియన్‌ పౌడర్‌, ఆమ్‌చూర్‌, పంచదార, ఉప్పు, మొక్కజొన్న పిండి జతచేసి.. అన్నిటినీ కలిపి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ పొడిని తడి లేని, గాలి చొరబడని సీసాలో నిలవ చేసుకుంటే సరిపోతుంది. ఇకపై మీ కూరలను అందరూ మెచ్చుకుంటే.. ఎంత సంతోషమో చూస్తారుగా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని