మహత్తరమైన చాయ్‌ కోసం.. మసాలా నూరేద్దాం!

అన్నం తినడంలో ఆలస్యాలూ నిర్లక్ష్యాలూ ఉండొచ్చు కానీ.. చాయ్‌ విషయంలో అలాంటివేం ఉండవు. పొద్దున్నే వేడివేడిగా కాస్త టీ తాగితే నిద్రమత్తు వదిలిపోయి చురుగ్గా ఉంటుంది

Published : 21 Apr 2024 00:07 IST

అన్నం తినడంలో ఆలస్యాలూ నిర్లక్ష్యాలూ ఉండొచ్చు కానీ.. చాయ్‌ విషయంలో అలాంటివేం ఉండవు. పొద్దున్నే వేడివేడిగా కాస్త టీ తాగితే నిద్రమత్తు వదిలిపోయి చురుగ్గా ఉంటుంది. ఇక అక్కణ్ణించి రాత్రి లోగా ఎన్నిసార్లు తాగితే అంత హుషారు. మనకు ఇంతగా ఇష్టమైన చాయ్‌ మరింత ప్రత్యేకంగా ఉంటే ఇంకెంత బాగుంటుందో కదూ! అందుకోసం ‘చాయ్‌ మసాలా పొడి’ ఉంటే చాలు. ఎలా చేయాలంటారా.. కడాయిలో 50 గ్రాముల యాలకులు, 30 గ్రాముల మిరియాలు, 25 గ్రాముల లవంగాలు, రెండు అంగుళాల దాల్చినచెక్క, ఒక టేబుల్‌స్పూన్‌ సోంపులను తక్కువ సెగ మీద.. మంచి వాసన వచ్చేదాకా వేయించి, పళ్లెంలోకి తీయాలి. తర్వాత 40 గ్రాముల శొంఠిని కూడా అలాగే ఘుమాయించేదాకా వేగనిచ్చి, పళ్లెంలో వేయాలి. ఈసారి తులసి విత్తనాల కంకులు 8, సగం జాజికాయను వేయించాలి. అన్నీ చల్లారాక.. మెత్తగా గ్రైండ్‌ చేసి.. సీసాలో భద్రం చేసుకోవాలి. టీ కాచేటప్పుడు.. ఈ పొడి కాస్త జోడించారంటే.. ఇక ఆ అద్భుతమైన రుచీ, పరిమళాల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.. ఆస్వాదించి ఆనందించాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని