అరగంటలో ఛోలే మసాలా పౌడర్‌!

ఉడికించిన శనగలతో చేసే ఛోలే చాలా టేస్టీగా ఉంటుంది కదూ! ఆ పేరు వింటేనే నోట్లో నీళ్లూరతాయి. అది చేసేందుకు అవసరమైన ‘ఛోలే మసాలా పొడి’ మనకు కుదరదు, మాస్టర్‌ ఛెఫ్‌లు మాత్రమే తయారుచేయగలరు

Published : 31 Mar 2024 00:19 IST

ఉడికించిన శనగలతో చేసే ఛోలే చాలా టేస్టీగా ఉంటుంది కదూ! ఆ పేరు వింటేనే నోట్లో నీళ్లూరతాయి. అది చేసేందుకు అవసరమైన ‘ఛోలే మసాలా పొడి’ మనకు కుదరదు, మాస్టర్‌ ఛెఫ్‌లు మాత్రమే తయారుచేయగలరు- అనుకుంటున్నారా? నిజానికి దాన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. అందుకోసం.. పావు కప్పు చొప్పున ధనియాలు, జీలకర్ర, రెండు చెంచాల చొప్పున మిరియాలు, ఆమ్‌చూర్‌, మెంతి ఆకు పొడి, చెంచా చొప్పున సోంపు, షాజీరా, లవంగాలు, పసుపు, రెండు నల్ల యాలకులు, అంగుళం సైజు దాల్చినచెక్క, కొద్దిగా జాపత్రి, 10 ఎండుమిరపకాయలు అవసరమవుతాయి.

కడాయిలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చినచెక్క, నల్ల యాలకులు, లవంగాలు, సోంపు, షాజీరా, జాపత్రిలను సన్న సెగ మీద మంచి వాసన వచ్చేవరకూ వేయించాలి. చివర్లో ఎండుమిరపకాయలు కూడా వేయించి దించేయాలి. పూర్తిగా చల్లారాక ఆమ్‌చూర్‌, మెంతి ఆకుల పొడి, పసుపు జతచేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అంతే.. ‘ఛోలే మసాలా పౌడర్‌’ రెడీ. దీన్ని తడి లేని, గాలి చొరబడని డబ్బాలో నిలవచేసుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని