ఈ పొడితో క్షణాల్లో బిర్యానీ

బిర్యానీ పేరు వింటే చాలు నోట్లో నీళ్లూర తాయి. కానీ.. అందులో వేసే దినుసులన్నీ అప్పటికప్పుడు నూరాలంటే కాస్త పెద్ద ప్రహసనమే. అదే ‘బిర్యానీ మసాలా పౌడర్‌’ సిద్ధంగా ఉందనుకోండి.. ఉప్మా అంత సులువైపోతుంది.

Published : 10 Mar 2024 00:10 IST

బిర్యానీ పేరు వింటే చాలు నోట్లో నీళ్లూర తాయి. కానీ.. అందులో వేసే దినుసులన్నీ అప్పటికప్పుడు నూరాలంటే కాస్త పెద్ద ప్రహసనమే. అదే ‘బిర్యానీ మసాలా పౌడర్‌’ సిద్ధంగా ఉందనుకోండి.. ఉప్మా అంత సులువైపోతుంది. ఈ పౌడర్‌ చేసేందుకు ఒక జాజికాయ, రెండు అంగుళాల దాల్చినచెక్క, పన్నెండు లవంగాలు, 10 యాలకులు, 3 నల్ల యాలకులు, రెండు చెంచాల మిరియాలు, పావు కప్పు ధనియాలు, చెంచా చొప్పున సోంపు, జీలకర్ర, నల్ల జీలకర్ర, కొద్దిగా జాపత్రి, ఏడెనిమిది బిర్యానీ ఆకులు, అర చెంచా పసుపు, 4 ఎండుమిర్చి, రెండు చెంచాల డ్రై జింజర్‌ పౌడర్‌ అవసరమవుతాయి. ఇంతకీ దీన్నెలా చేయాలంటే.. కడాయిలో బిర్యానీ ఆకులు, ఎండు మిర్చి వేయించి పళ్లెంలోకి తీయాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, నల్ల జీలకర్ర, సోంపు మంచి సువాసన వచ్చేవరకూ వేయించి తీయాలి. ఆ తర్వాత జాజికాయ, దాల్చినచెక్క, బ్లాక్‌ కార్డమమ్‌, మిరియాలు, యాలకులు, లవంగాలు, జాపత్రి కూడా వేయించాలి. అన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్‌ చేసి.. పసుపు, డ్రై జింజర్‌ పౌడర్‌ జత చేస్తే సరి.. ఘుమఘుమలాడే బిర్యానీ మసాలా పౌడర్‌ తయారైనట్లే. దీన్ని తడిలేని, గాలి చొరబడని సీసాలో భద్రం చేసుకుంటే తినాలనిపించినప్పుడల్లా క్షణాల్లో బిర్యానీ చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని