అల్లం పొడి ఇంట్లోనే

డ్రైడ్‌ జింజర్‌ పౌడర్‌ అంటే శొంఠి పొడి అనుకుంటారు కొందరు. నిజానికి అల్లాన్నే ఎండబెట్టి పొడి చేస్తారు. వంటలకు అదనపు రుచి తెప్పిస్తుందిది. ఇంతకూ ఈ పొడిని ఎలా తయారు చేయాలంటే..పావు కిలో అల్లం కడిగి, పొట్టు తీయాలి.

Updated : 25 Feb 2024 00:10 IST

రుచి పెంచే రహస్యం

డ్రైడ్‌ జింజర్‌ పౌడర్‌ అంటే శొంఠి పొడి అనుకుంటారు కొందరు. నిజానికి అల్లాన్నే ఎండబెట్టి పొడి చేస్తారు. వంటలకు అదనపు రుచి తెప్పిస్తుందిది. ఇంతకూ ఈ పొడిని ఎలా తయారు చేయాలంటే..పావు కిలో అల్లం కడిగి, పొట్టు తీయాలి. ఎంతమాత్రం తడి లేకుండా ఆరబెట్టాలి. తర్వాత చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటిని పü˘్లంలో పరిచినట్లు అమర్చి మూడు రోజులు ఎండలో ఉంచాలి. ఇంకో ఐదు రోజులు నీడలో ఆరబెట్టాలి. అలా పూర్తిగా ఎండిన తర్వాత గ్రైండర్‌లో వేసి పొడి చేయాలి. తడి లేని, గాలి చొరబడని సీసాలో ఉంచితే చాన్నాళ్లు నిలవుంటుంది. అవసరానికి వాడుకోవచ్చు. సూప్స్‌, కర్రీస్‌, స్నాక్స్‌లో వేసుకుంటే.. వాటి రుచి రెట్టింపవుతుంది, అనేక అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. టీలో చిటికెడు పొడి వేశామంటే ప్రత్యేకంగా ఉండటమే కాదు.. శ్వాస ఇబ్బందుల నుంచీ ఉపశమనం కలుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని