సాంబార్‌ పౌడర్‌ ఇంట్లోనే!

కూర, పచ్చడితో అన్నం తినేశాక కాస్త సాంబార్‌ ఉంటే ఎంత బాగుంటుంది కదూ! ఆ నోరూరించే సాంబార్‌ను ఇంట్లోనే చేసినా.. అందుకు అవసరమైన పొడిని మాత్రం చాలామందికి కొనుక్కోవడమే అలవాటు.

Published : 24 Mar 2024 00:03 IST

కూర, పచ్చడితో అన్నం తినేశాక కాస్త సాంబార్‌ ఉంటే ఎంత బాగుంటుంది కదూ! ఆ నోరూరించే సాంబార్‌ను ఇంట్లోనే చేసినా.. అందుకు అవసరమైన పొడిని మాత్రం చాలామందికి కొనుక్కోవడమే అలవాటు. అందుకు బదులుగా ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. ఎలాగంటారా.. పావు కప్పు శనగపప్పు, రెండు చెంచాల మినప్పప్పు, 2 టేబుల్‌స్పూన్ల జీలకర్ర, అర టేబుల్‌స్పూన్‌ ఆవాలు, అర కప్పు ధనియాలు, ఒకటిన్నర చెంచా మెంతులు, చెంచా మిరియాలు, అర చెంచా చొప్పున ఇంగువ, పసుపు, 10 ఎండు మిరపకాయలు, 15 కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి.

ముందుగా కడాయిలో ధనియాలు, జీలకర్రలను సన్న సెగ మీద రెండు నిమిషాలు వేయించాలి. మంచి వాసన వస్తుండగా వాటిని పü˘్లంలోకి తీసి, ఎండుమిరపకాయలు కొన్ని క్షణాలు వేయించాలి. వాటిని తీసి మెంతులు, అవి వేగాక మిరియాలు, అవి వేగాక శనగపప్పు, తర్వాత మినప్పప్పు, తర్వాత కరివేపాకు, అది కూడా వేగాక ఆవాలను వేయించి తీయాలి. స్టవ్వు కట్టేసి.. కడాయిలో ఇంగువ వేయాలి. ఆ వేడికి మంచి వాసన వస్తుంది. ఈ వేయించిన దినుసులన్నీ చల్లారాక పసుపు జోడించి గ్రైండ్‌ చేయాలి. జార్‌ చిన్నగా ఉంటే రెండు మూడు దఫాలుగా చేయొచ్చు. మెత్తగా అయ్యాక బాగా కలిపి తడి లేని సీసాలో భద్రం చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని