ఎమోజీ.. అర్థమిదే జీ!

చాటింగ్‌లో ఎమోజీలు వాడకుండా కుర్రకారుకి రోజు గడవని కాలమిది. సంతోషం, కోపం, మురిపెం, అలక, ముద్దూముచ్చటా..

Published : 27 Aug 2022 01:16 IST

చాటింగ్‌లో ఎమోజీలు వాడకుండా కుర్రకారుకి రోజు గడవని కాలమిది. సంతోషం, కోపం, మురిపెం, అలక, ముద్దూముచ్చటా.. అన్ని హావభావాలూ చకచకా సంజ్ఞల రూపంలో తర్జుమా కావాల్సిందే. ఇందులో కొన్ని అర్థమయ్యీ, కానట్టుగా ఉంటాయి. అవేంటి? అర్థాలేంటి? అంటే..

* దీనర్థం నువ్వు దుమ్ము దులుపు తున్నావు.. ఇలాగే కొనసాగించు అని. మన సపోర్ట్‌ని తెలియజేయడం అన్నమాట.

*ఇది విజయానికి సంకేతం. దాంతోపాటు కూల్‌, జస్ట్‌ చిల్లింగ్‌, అంతా ఓకే అనేదానికీ వాడుతున్నారు.

*దీన్ని సాధారణంగా సెల్యూట్‌ చేయ డానికి, పరస్పరం పలకరింపులు, మర్యాదపూర్వక అభినందనలు తెలియజేయడానికి ఉపయోగిస్తారు.

* వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌.. మాధ్యమాల్లో దీన్ని విచ్చలవిడిగా వాడేస్తుంటారు. వేడుకలు ప్రారంభిద్దాం అని చెప్పడానికి సంకేతం.

*  చిన్న మొత్తం.. చిన్న సాయం.. చిన్నమాట.. విషయం ఏదైనా ఒక చిన్నమాట అన్నమాట.

* ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో తెగ వాడేస్తున్నారు. ఒకరిపై ఉన్న ప్రేమ, ఆపేక్షను తెలియజేయడం.

* క్రాస్డ్‌ ఫింగర్‌: ఇలా వేళ్లు ముడిపడ్డాయంటే దాని అర్థం గుడ్‌లక్‌ అని చెప్పడం.. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని అర్థం.

* ‘బాబా’లో రజనీకాంత్‌ ఇదే పోజు పెట్టారు. వేళ్లని పరీక్షించి చూస్తే ‘ఐ.ఎల్‌.యూ.’ రూపం కనిపిస్తుంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకర్నొకరు ఇష్టమని చెప్పుకోవడానికి ఇది వాడుతున్నారు.

*  కుర్రాళ్లు అదేపనిగా వాడుతున్న ఎమోజీ ఇది. ఎదుటివాళ్లకి ప్రేమ, సపోర్ట్‌ తెలియచెప్పడం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని