పొలిటికల్‌ పంచ్‌

సినిమాల్లో హీరో పంచ్‌ డైలాగ్‌ చెబితే అభిమానులు ఈల వేసి గోల చేస్తారు. బాగా పాపులరైన కొన్ని సంభాషణలను అభ్యర్థి-ఓటరుకు అన్వయించి చెబితే..

Published : 12 Nov 2022 00:20 IST

సినిమాల్లో హీరో పంచ్‌ డైలాగ్‌ చెబితే అభిమానులు ఈల వేసి గోల చేస్తారు. బాగా పాపులరైన కొన్ని సంభాషణలను అభ్యర్థి-ఓటరుకు అన్వయించి చెబితే.. సరదాగా ఇలా ఉంటాయి.

* ఎవడు గుద్దితే ఫేట్‌ మారి సీటు గల్లంతవుతుందో ఆడే ఓటరు.  
* వీలైతే ప్రజలకు మంచి చేద్దాం డ్యూడ్‌... ఫిదా అయితే తిరిగి ఓటేస్తారు.  
* నీ టార్గెట్‌ మినిస్టర్‌ పోస్ట్‌ అయితే... ఎయిమ్‌ ఫర్‌ ది చీఫ్‌ మినిస్టర్‌ పోస్ట్‌.
* నువ్వు పదవిలో ఉన్నప్పుడు ప్రజల మంచి గురించి మాత్రమే ఆలోచించాలి... లేదంటే నీకు నెక్స్ట్‌ ఎలక్షన్‌ ఉండదు.  
* అభ్యర్థి.. ఓటర్లను నిర్లక్ష్యం చేసినా అభ్యర్థికే రిస్క్‌. అభ్యర్థిని ఓటర్లు నిర్లక్ష్యం చేసినా అభ్యర్థికే రిస్క్‌.  
* సర్పంచి, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ.. ఏ ఎలక్షన్స్‌ అయినా మనం ఓటు వెయ్యనంతవరకే వ్యాల్యూ. వన్స్‌ వి వోటెడ్‌ ఫ్యూచర్‌ సరెండర్‌.  
* ఒక్కసారి నెగ్గితే మన నాయకుడే మన మాట వినడు.  
* నేను నిస్వార్ధంగా ప్రజలకు ఎంతో కొంత సేవ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాలను భ్రష్టు పట్టించడానికే వచ్చాను.  
* వెయ్‌... ఒక్క ఓటే వెయ్‌... రెండు, మూడు ఓట్లు వేయాలనుకోకు. పట్టుబడతావ్‌... పోలీసుల చేతిలో పచ్చడవుతావ్‌.  
* నువ్వు సర్పంచ్‌ అవ్వాలంటే ఓటరు కావాలి... నువ్వు ఎమ్మెల్యే అవ్వాలంటే ఓటరు కావాలి... నువ్వు ఎంపీ అవ్వాలంటే ఓటరు కావాలి... కానీ గెలిచిన తర్వాత ఓటరు బాగోగులు నీకు అవసరం లేదు.

- జముళ్లముడి ఆల్‌ఫ్రెడ్‌, గజ్జలకొండ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని