తెరతో పైలం..

బిల్లు కట్టడానికి.. సెల్లు కొనడానికి.. ఫుల్లుగా సినిమాలు చూడటానికి.. స్నేహితులతో సొల్లు చెప్పడానికి.. వీటితోపాటు ముఖ్యమైన పనులు చేయడానికీ యువతకి మొబైల్‌ ఫోన్‌ లేదంటే పీసీ కావాల్సిందే

Published : 03 Jun 2023 00:22 IST

బిల్లు కట్టడానికి.. సెల్లు కొనడానికి.. ఫుల్లుగా సినిమాలు చూడటానికి.. స్నేహితులతో సొల్లు చెప్పడానికి.. వీటితోపాటు ముఖ్యమైన పనులు చేయడానికీ యువతకి మొబైల్‌ ఫోన్‌ లేదంటే పీసీ కావాల్సిందే. అలా అదేపనిగా కళ్లు తీవ్రంగా అలసిపోతాయి. దీర్ఘకాలంలో విపరీతమైన సమస్యలొస్తాయి. దీన్నే  కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ అంటారు. దీని బారిన పడకుండా..

* తలనొప్పి, కళ్లు పొడిబారడం, చూపు మసక, తీవ్రంగా అలసిపోవడం.. ఈ లక్షణాలే  కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌. సాధ్యమైనంత వరకూ డిజిటల్‌ తెరల్ని చూడటం తగ్గించడమే సమస్యకు పరిష్కారం.
గ్యాడ్జెట్లతో పని చేస్తున్నప్పుడు తెరకు మరీ దగ్గరగా కాకుండా... కొంచెం దూరంలో ఉంచితే ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. బ్రైట్‌నెస్‌, కాంట్రాస్ట్‌ని తగ్గించినా కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
* కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో బ్లూలైట్‌ ఫిల్టర్లు ఉంటాయి. ఇవి గ్యాడ్జెట్ల నుంచి వెలువడే హానికరమైన నీలి కాంతిని అడ్డుకుంటాయి. వాటిని క్రియాశీలం చేయాలి.
కంప్యూటర్‌ వాడుతున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకోసారి తెరకి 20 అడుగుల దూరమైనా జరగాలి. కనీసం 20 సెకన్ల పాటైనా విశ్రాంతి తీసుకోవాలి. దీన్ని 20-20-20 నిబంధన అంటారు. ఇలా చేస్తే తెర ప్రతికూల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
తెరని తదేకంగా చూడకుండా.. ఐదు నిమిషాలకోసారి కళ్లని మూసి తెరవడం, రెండు అరచేతులతో కళ్లని రుద్దుకోవడం.. పడక ఎక్కడానికి ఒక గంట ముందే గ్యాడ్జెట్లని వాడకపోవడం లాంటివీ కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ ప్రభావాన్ని తగ్గిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని