దురదృష్టం అంటే...

సెల్‌ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోయినప్పుడే ఇంట్లో కరెంట్‌ పోవడం.

Published : 03 Jun 2023 00:56 IST

* సెల్‌ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోయినప్పుడే ఇంట్లో కరెంట్‌ పోవడం.
* పరీక్షలో మనం ఫెయిలై.. మనదాంట్లో చూసి కాపీ కొట్టినవాడు ఫస్ట్‌క్లాస్‌లో పాసవడం.
* రాత్రంతా వర్షం పడి.. కాలేజీకెళ్లే సమయానికే ఆగిపోవడం.
* అభిమాన హీరో సినిమా కోసం గంట నుంచి క్యూలో నిల్చుంటే.. మనవంతు వచ్చేసరికే టికెట్లు అయిపోవడం.
* ఇంట్లో ఉన్న దుస్తులన్నీ ఉతికి ఆరేసినప్పుడే.. కుండపోత వర్షం పడటం.
* జీతం వచ్చి నచ్చిన ఫోన్‌ కొనుక్కుందాం అనుకున్నప్పుడే ఆఫర్లు ఎత్తేయడం.
ఉల్లేరావు శ్రావణి, జయశంకర్‌ భూపాలపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని