కొంటె కొటేషన్‌

మరిచావా.. శిరస్త్రాణం?ఇదేనేమో నీ ఆఖరి ప్రయాణం!

Published : 16 Sep 2023 00:50 IST

  • మరిచావా.. శిరస్త్రాణం?

ఇదేనేమో నీ ఆఖరి ప్రయాణం!

మువ్వల రామారావు, ఉద్దవోలు

  • అయ్యో విరిగిందా బండి వీల్‌...

పోనీలే.. బాగుందిగా నీ కీలు!

కవుటూరి శ్రీలత, నెల్లూరు

  • అది మేడిన్‌ చైనానా?

కొనడం మానెయ్‌ ఇకనుంచైనా!

గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

  • నీ ఫీట్లకి భయమేస్తోంది మామా...

ఇంతకీ చేయించావా బీమా!

పి.సాంబశివారెడ్డి, కడప

  • చేద్దామనుకున్నాడు గొప్ప ఫీటు..

సహకరించలేదు ఫేటు!

నివాస్‌ ఓట్ర, ఈమెయిల్‌

  • వేశాడు సడెన్‌ బ్రేక్‌...

బండికి పడింది పెద్ద క్రాక్‌!

వి.భరత్‌, గుమ్మడిదుర్రు

  • విరిగింది బండి...

జారింది గుండె!

విజయకుమార్‌ తమ్మినేని, బెంగళూరు


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని