నా ప్రేమని డిపాజిట్‌ చేశా!

నువ్వు మా బ్యాంకుకొచ్చిన మొదటిసారే నా కళ్లకి ప్రివిలేజ్డ్‌ కస్టమర్‌లా కనిపించావు. అప్పుడే అచ్చేసిన కరెన్సీ కాగితంలా మెరిసిపోతున్న నిన్ను చూసి నా గుండె జారిపోయింది. పక్క కౌంటర్‌ ఖాళీగా ఉన్నా.. నా దగ్గరికే వచ్చి ‘ఎక్స్‌క్యూజ్‌మీ..

Published : 21 Oct 2023 00:05 IST

వెరైటీ ప్రేమలేఖ

డియర్‌ వడ్డీకాసుల వనజా...

నువ్వు మా బ్యాంకుకొచ్చిన మొదటిసారే నా కళ్లకి ప్రివిలేజ్డ్‌ కస్టమర్‌లా కనిపించావు. అప్పుడే అచ్చేసిన కరెన్సీ కాగితంలా మెరిసిపోతున్న నిన్ను చూసి నా గుండె జారిపోయింది. పక్క కౌంటర్‌ ఖాళీగా ఉన్నా.. నా దగ్గరికే వచ్చి ‘ఎక్స్‌క్యూజ్‌మీ.. మీ బ్యాంకులో నగదు క్రెడిట్‌ చేయడమెలా?’ అంటుంటే.. నా ప్రేమను నీ మనసులో క్రెడిట్‌ చేయాలని అప్పుడే భావించాను. రోజులు గడిచినకొద్దీ నీ నవ్వులు.. మాటలతో అనుబంధం, ఆప్యాయతల్ని నాలో డిపాజిట్‌ చేస్తూనే ఉన్నావు. ఆ సంతోషంలో నీపై ఇష్టం రోజురోజుకీ వడ్డీలా పెరిగిపోతూనే ఉండేది. లాంగ్‌టర్మ్‌ డిపాజిట్‌లా చాలాకాలం ఓపికగా ఎదురుచూసి ఈమధ్యే నా మనసులో మాటను విన్నవించుకున్నాను. వ్యక్తిగత రుణం తీసుకునే ముందు సమర్పించే డాక్యుమెంట్లలా.. నీ సందేహాలన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పాను. నువ్వేమో.. అప్పు ఎగ్గొట్టిన ఖాతాదారుడి ఖాతాను హోల్డ్‌లో పెట్టినట్టు నా విన్నపాన్ని ఎటూ తేల్చడం లేదు. నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెద్దగా లేకపోయినా.. నీపై నాకున్న ఇష్టం.. నమ్మకమైన ప్రభుత్వ బ్యాంకులా దృఢమైంది. దయచేసి నా ప్రేమను ఓకే చేసి నన్ను నీ అసెట్‌గా చేసుకో. నా అనురాగాన్ని నీకే జీవితాంతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి ప్రేమగా చూసుకుంటాను.

దుర్గారావు కుతాడ, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని