కొంటె కొటేషన్‌

పులితో స్విమ్మింగ్‌... చూసేవాళ్లకి థ్రిల్లింగ్‌!

Published : 30 Mar 2024 00:04 IST

 • పులితో స్విమ్మింగ్‌... చూసేవాళ్లకి థ్రిల్లింగ్‌!

టి.ప్రమీల, మల్కాజిగిరి

 • పులిమీదనా నీ స్వారీ... నీటిలో పడ్డావో హరీ!

రూప, విప్పలమడక

 • దూకడానికి అంత ఆత్రమా... పులి వెనకాలే ఉంది మిత్రమా!

అక్కలదేవి రాంబాబు, హైదరాబాద్‌

 • సాహసం చేయరా డింభకా... చావుకేమాత్రం వెరవక!

పూడూరి రాంరెడ్డి, జగిత్యాల్‌

 • ముందు చూస్తే జలం... వెనకేమో శార్దూలం!

కొంపెల్లి హరికిషన్‌, హైదరాబాద్‌

 • వచ్చేస్తోంది వ్యాఘ్రం... తప్పుకో శీఘ్రం!

రామారావు మువ్వల, ఉద్దవోలు

 • డైవ్‌ చేస్తున్న స్విమ్మరు... వెనక ఉంది చూసుకో టైగరు!

నివాస్‌ ఓట్ర, ఈమెయిల్‌

 • పులితో ఎందుకు వేళాకోళం... బలిపెట్టకు నీ విలువైన ప్రాణం!

గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

 • ఎలా చేయాలో డైవింగ్‌...పులికి ఇస్తున్నాడు ట్రైనింగ్‌!

అల్లాడ విమోచన్‌, దూసి

 • పులిరాజుతో సయ్యాటా? దొరికావో ముగుస్తుంది నీ ఆట!

బి.సృజని, వెంకటాపురం

 • పులికి రాదు ఈత... నేనే అవుతా విజేత!

ఎ.రాంబాబు, ఈమెయిల్‌ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని